Saturday, January 18, 2025
HomeTrending NewsTDP: వారికి ఓటమి ఖాయం: కేశవ్ జోస్యం

TDP: వారికి ఓటమి ఖాయం: కేశవ్ జోస్యం

చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా జగన్ చేసిన తప్పుడు పనితో వచ్చే ఎన్నికల్లో వైసీపీ 2, 3 స్థానాలకు పరిమితం కానుందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జోస్యం చెప్పారు.  వెంటాడుతున్న ఓటమిభయం..చంద్రబాబుపై ఉన్న కక్షతోనే జగన్ తప్పుడు మార్గంలో వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత అరెస్ట్ ద్వారా ప్రజల్ని దారిమళ్లించి, అంతిమంగా తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలన్నదే జగన్ లక్ష్యమని కానీ అది నెరవేరదని స్పష్టం చేశారు.  చట్టాన్ని అమలుచేయాల్సిన వాళ్లు వైసీపీ చుట్టాలైనప్పుడు… ఆ చట్టాల్ని ఎలాగైనా ఎవరిమీదైనా తాము అనుకున్నట్టు అమలు చేయవచ్చని,  అసైన్డ్ భూములైనా …ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారమైనా, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అయినా ప్రభుత్వానిది అదే విధానమంటూ కేశవ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఒక్క చంద్రబాబుతోనే ఈ అరెస్టులు వదిలిపెట్టరని, ఇంకా చాలామందిని అరెస్ట్ చేయడం అంతిమంగా టీడీపీని డిస్టర్బ్ చేయడమే వీళ్ల లక్ష్యమని కేశవ్ అభిప్రాయపడ్డారు.  తాను, తనప్రభుత్వం ప్రజల్లో పరాభవం ఎదుర్కోబోతున్నామని తెలిసి కనీసం తెలుగుదేశాన్ని అయినా నిర్వీర్యంచేయాలన్న కుట్రతప్ప మరేమీ లేదన్నారు.  జగన్ కంటే దుర్మార్గంగా నియంత్రత్వంతో విర్రవీగిన ఇందిరాగాంధీ ఎలా ఓడిపోయిందో  తెలుసుకోవాలని హితవు పలికారు.

“తెలుగుదేశం పార్టీ అనేది ట్రైనింగ్ గ్రౌండ్ అని పదేపదే చంద్రబాబు చెబుతుండే వారు. వేలాది నాయకుల్ని చంద్రబాబు తయారుచేశారు. అంతకు పదింతలు సుశిక్షితులైన సైనికుల్లాంటి కార్యకర్తలు తెలుగుదేశానికి అండగా ఉన్నారు. రేపు జరగబోయే రాజకీయ రణక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ రెట్టింపు ఉత్సాహంతో జగన్ రెడ్డిని  ఎదుర్కో వడం ఖాయం.. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని మట్టికరిపించడం ఖాయం” అని కేశవ్ వెల్లడించారు.

“4 ఏళ్లలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఇదిగో ఇంత సొమ్ము.. ఫలానా వారి నుంచి ఫలానా వ్యక్తికి చేరిందని జగన్ రెడ్డి, అతనిప్రభుత్వం నిరూపించలే కపోయింది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని సదరు కార్పొరేషన్ గానీ, ప్రాజెక్ట్ లోభాగస్వాములైన సంస్థలు గానీ చెప్పలేదు. 2021 చివర్లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు అన్నిరకాల పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిందని వైసీపీ ప్రభుత్వంలోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ధృవీకరించింది.  ఇదే ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఎండీగా అన్నిసంస్థలు అద్భుత పనితీరు కనబరిచాయని ప్రశంసించారు.   మీ ప్రభుత్వమే అప్పుడలా చెప్పి.. ఇప్పుడు అవినీతి జరిగిందని చంద్రబాబుని అరెస్ట్ చేయడం ముమ్మాటికీ కక్షసాధింపే” అని కేశవ్ విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్