Monday, January 27, 2025
HomeTrending NewsP4 Formula: బాబు చెప్పేది పి-420 ఫార్ములా: ఎమ్మెల్సీ కల్యాణి

P4 Formula: బాబు చెప్పేది పి-420 ఫార్ములా: ఎమ్మెల్సీ కల్యాణి

చంద్రబాబు, లోకేష్ యాత్రలకు జనం రావడం లేదని, అందుకే వారిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లి సిఎం జగన్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. అన్ని సర్వేల్లో జగనే మళ్ళీ సిఎం అని వెల్లడవుతోందని, టిడిపి ఇక బలపడే అవకాశం లేకపోవడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కల్యాణి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంతంగా చేసుకున్న సర్వేల్లో కూడా జగన్ కే అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయన్నారు.

అధికారంలోకి వస్తే పేదవారిని కోటీశ్వరులను చేస్తానంటున్న చంద్రబాబు గతంలో సిఎం గా ఉన్న 14 ఏళ్ళలో ఏం చేశారని నిలదీశారు. ఆ పని చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. మూడు సార్లు సిఎం గా పనిచేసిన బాబు రెండెకరాల నుంచి రెండు వేల కోట్ల రూపాయలకు ఎదిగారని, హైదరాబాద్ లో 500 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారని, కనీసం పేదలకు ఇళ్ళు కూడా కట్టించలేదని విమర్శించారు.

చంద్రబాబు చెప్పేది పి-4 ఫార్ములా కాదని 420 ఫార్ములా అని అభివర్ణించారు. ఆయన చెప్పే నాలుగు ‘పి’లకు అర్ధం… పంగనామాలు, పచ్చి అబద్ధాలు, పచ్చ పత్రికలు, పోట్లు అని.. ఈ నాలుగింటితోనే బాబు మూడుసార్లు సిఎం అయ్యారని కల్యాణి వ్యాఖ్యానించారు. బాబు 2020అని గతంలో చెప్పారని, ఆ సమయానికి ఇంట్లో కూర్చో బెట్టారని,  ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని, ఆ సమయానికి టిడిపి కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. బాబు ఇలాగే చేస్తే ఆయనకు శాశ్వతంగా ఒక్క ‘పి’.. ప్రతిపక్ష హోదా మాత్రమే మిలుగుతుందని కల్యాణి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్