Monday, January 20, 2025
HomeTrending NewsYS Jagan: విద్యా దీవెన ఒక వరం: సిఎం

YS Jagan: విద్యా దీవెన ఒక వరం: సిఎం

ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో మన  పిల్లలకు సీట్లు లభిస్తే పేదరికం వారికి  అడ్డుగా ఉండకూడదని, ఈ ఆలోచనతోనే  జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సామాన్యులకు ఇంత ఫీజులు కట్టి చదవడం సాధ్యమేనా?  అన్న ఆలోచన తనకు వచ్చిందని… కానీ  ఇలాంటి కాలేజీల నుంచి చదివి బయటకు వస్తేనే, రేపు మన పిల్లలు ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ సీఈఓలుగా ఉద్యోగాలు చేసే స్థాయి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం రెండో విడతలో  అర్హులైన 357 మందికి రూ.45.53 కోట్లను బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమచేశారు.  గడచిన ఆరునెలల్లో  దీని ద్వారా మొత్తం  రూ. 65.48 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన కీలక వ్యాఖ్యలు…

  • దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం
  • మంచి కాలేజీల్లో సీట్లు వచ్చినా సరే… డబ్బు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో చదువులకోసం ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తు్న్నాం
  • మొత్తంగా 357 మంది పిల్లలకు ఇవాళ రూ. 45.53కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం
  • అవినీతికి, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగాఅమలు చేస్తున్నాం
  • ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం
  • క్యూస్‌, టైమ్స్‌ ర్యాంకింగ్స్‌లో 21 కోర్సుల్లో టాప్‌ సుమారు 350 కాలేజీల్లో సీటు వస్తే ఇస్తున్నాం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్లు వరకూ మిగిలిన వారికి కోటి రూపాయల వరకూ చెల్లిస్తున్నాం.  విమాన ఛార్జీలు, వీసా ఛార్జీలు కూడా ఇస్తున్నాం.
  • ఇలాంటి యూనివర్శిటీల్లో చదవాలంటే.. చాలా ఖర్చవుతుంది.
  • ఇలాంటి కాలేజీల్లో సీట్లు వచ్చే మన పిల్లలకు మనం సపోర్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నాం
  • అలా కాకపోతే… మన పిల్లలను ఏరకంగా లీడర్లుగా చూడగలుగుతాం?
  • గతంలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చేవారు, ఎస్సీఎస్టీ వాళ్లకు రూ.15 లక్షలు మాత్రమే… ఎక్కడ రూ.10లక్షలు, ఇప్పుడు ఎక్కడ 1.25కోట్లు?
  • గతంలో సిఫార్సులు ఉంటేనే ఇచ్చేవారు, అదికూడా అరకొరే
  • రూ.318 కోట్లు ఏకంగా బకాయిలు పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వానిది
  • ఇవాళ ఆ స్కీంలో పూర్తిగా మార్పులు తీసుకు వచ్చాం
  • శాచ్యురేషన్‌ పద్ధతిలో అమలు చేస్తున్నాం, టాప్‌ 320 కాలేజీలకు వర్తింపు చేస్తున్నాం
  • విద్యారంగంలో ఇది విప్లవాత్మక మార్పు, ఇలా విద్యార్థులకు బాసటగా నిలుస్తున్న రాష్ట్రం… మన రాష్ట్రంమాత్రమే
  • ఈ కాలేజీల్లో చదువుతున్న పిల్లలు పెద్ద పెద్ద స్థాయిల్లో రాణించాలని కోరుకుంటున్నాను
  • నాలుగు వాయిదాల్లో ఈ స్కాలర్‌ షిప్‌ ఇస్తున్నాం
  • ఇమ్మిగ్రేషన్‌ అనుమతిరాగానే ఒక వాయిదా, మొదటి సెమిస్టర్‌ పూర్తికాగానే రెండో వాయిదా, రెండో సెమిస్టర్‌ రాగానే మూడో వాయిదా, 4వ సెమిస్టర్‌ పూర్తయ్యాక నాలుగో వాయిదా ఇస్తున్నాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్