Saturday, February 22, 2025
HomeTrending Newsఉద్యోగులను మోసం చేశారు: బాబు

ఉద్యోగులను మోసం చేశారు: బాబు

Employees betrayed: తమ హయంలో విభజన ఇబ్బందులు, ఆర్ధికంగా ఎన్ని ఓడిదుడుకులున్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కానీ జగన్ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు.  ఉద్యోగులను బెదిరించే విధంగా సజ్జల మాట్లాడడాన్ని బాబు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, ఆర్టీసీ, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ మోసం చేసిందని ఆరోపించారు.

తమ ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించిన రాయితీల్లో కూడా ఈ ప్రభుత్వం కోత పెట్టడం జగన్ పెద్ద మనసుకు నిదర్శనమా అని ప్రశ్నించారు. రాష్టాన్ని లూటీ చేయడం, దుబారా ఖర్చులు కట్టిపెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. 32 నెలల పాలనలో సిఎం జగన్ ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 11, 611 కోట్ల రూపాయల భారం పెంచారని, వెంటనే ఛార్జీలు తగ్గించాలని, డిస్కంలకు ఇవ్వాల్సిన బాకీలు వెంటనే విడుదల చేసి విద్యుత్ వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.

టిడ్కో గృహాల పేరుతో తీసుకువచ్చిన రూ. 7,300 కోట్ల రుణాలు దారి మళ్ళించారని, లబ్దిదారుల పేరుమీద మరో నాలుగు వేల కోట్ల రూపాయలు రుణం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాబు వెల్లడించారు. రాజధాని అంశంపై  హైకోర్టు విచారణ జరుపుతున్న దశలో అక్కడి భూములు తనఖా పెట్టడం సరికాదన్నారు.

Also Read : చర్చలు సఫలం: ఉద్యోగుల సమ్మె విరమణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్