రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధీమా వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో సిఎం జగన్ ప్రజలను మోసం చేశారని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ రెండేళ్లలో సియం చేసిందేమీ లేదని విమర్శించారు.
జగన్ ప్రభుత్వం హద్దులు దాటి అప్పులు చేస్తోందని, ఈ అప్పుల భారం ప్రజల మీదే పదుతుందని యనమల హెచ్చరించారు. దుబారా ఖర్చులు విపరీతంగా చేస్తోందని, ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. ఈ ప్రభుత్వం అప్పులు తేవడమే తప్ప తీర్చే పరిస్థితి కనబడడం లేదని, విద్యుత్ సమస్యతో రాష్ట్రం అంధకారంలో ఉందని అయన వాపోయారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.