Jagan Govt Cannot Succeed On 3 Capitals Says Nara Lokesh
అమరావతి రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్ర’ అశేష ప్రజానీకం మద్దతుతో జన సంద్రాన్ని తలపించేలా సాగుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాజధానికి భూములిచ్చిన 30 వేల మంది రైతుల సమస్యను చిన్నచూపు చూసిన పాలకుల కళ్లు బైర్లు కమ్మేలా కోట్లాది రాష్ట్ర ప్రజలు ఈ యాత్రకు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజా రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్రలకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, కూలీలు సాగిస్తున్న పోరాటం 700 రోజులకు చేరిందన్నారు. జగన్, ఆయన మంత్రులు మరో మూడు జన్మలెత్తినా మూడు రాజధానులు కట్టలేరని సవాల్ చేశారు.
ప్రజా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం, రాజధానిని కొనసాగించాలంటూ ప్రాణాలు కోల్పోయిన వారి అమరత్వం నిరుపయోగం కావని అయన భావోద్వేగంతో వెల్లడించారు ‘‘అమరావతి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష.. అమరావతి వైపు న్యాయం ఉంది.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు ఉంది.. ఒకే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటాయి.. జై ఆంధ్రప్రదేశ్..జై అమరావతి’’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.
Also Read : ప్రజలు తిరగబడుతున్నారు: బాబు