Saturday, January 18, 2025
HomeTrending Newsనేడు మ్యానిఫెస్టో: రేపటి నుంచి మలి విడత ప్రచారం

నేడు మ్యానిఫెస్టో: రేపటి నుంచి మలి విడత ప్రచారం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోను నేడు విడుదల చేయనుంది తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, యువత, రైతులు ఎజెండాగా కొన్ని ముఖ్యాంశాలు పొందుపరిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా రేపు ఏప్రిల్ 28 ఆదివారం నుంచి జగన్ మలివిడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

తాడిపత్రిలో ఉదయం నిర్వహించే సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు , ప్రతి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు.

ఆదివారం ఉదయం  11 గంటలకు అనంతపురం జిల్లా తాడిపత్రి;  1.30 గంటలకు తిరుపతి జిల్లా వెంకటగిరి; సాయంత్రం 3.40 గంటలకు ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కందుకూరులో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్