Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

‘బాహుబలి’, ‘కె.జి.యఫ్’ సినిమా స్థాయిలో వస్తున్న మరో అద్భుత భారీ చిత్రం ‘జై భజరంగి 2’. కరుండా చక్రవర్తి డా.శివరాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషలలో లో ఒకేసారి అక్టోబర్ 29న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు అక్టోబర్ 23న ఉదయం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, నిర్మాత, పంపిణి దారుడు కరుణాకర్ రెడ్డి, ప్రముఖ పంపిణీదారుడు రాము, మార్కెటింగ్ ప్రొడ్యూసర్ బాలు పాల్గొన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ “కన్నడలో సూపర్ స్టార్ అయిన రాజ్ కుమార్ తనయుడు శివ రాజ్ కుమార్ గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు. తెలుగు లో రెండవ చిత్రంగా ఆయన నటించిన ‘జై భజరంగి’ ట్రైలర్ ఇప్పుడు మీరే స్వయంగా చూశారు. అది ఏ స్థాయిలో ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, చంద్రముఖి, అరుందతి, వంటి చిత్రాలలో వుండే థ్రిల్లింగ్ ఈ సినిమాలో వుంది. ఇందులో ఏ ఫ్రేమ్ చూసిన భారీతనం ఉట్టిపడుతుంది. ట్రైలర్ చూస్తుంటే పూర్తి సినిమా ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. తప్పని సరిగా మన తెలుగు వారికి నచ్చే సినిమా అవుతుంది” అన్నారు.

తెలుగు వెర్షన్ నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ “ఏడు నెలలక్రితం ‘భజరంగి-2’  టీజర్ చూశాను. ఇంత భారీగా నిర్మించిన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా తప్పని సరిగా ఆదరిస్తారని గ్రహించి, గత 30 ఏళ్లుగా వీడియోరంగంలో వున్న మా సంస్థ ‘శ్రీ బాలాజీ వీడియో’ ఒక మంచి చిత్రంతో నిర్మాణరంగంకి ఎంటర్ అవ్వాలని ‘జై భజరంగి’ హైక్వాలిటీ చిత్రంతో శ్రీకారం చుట్టాము. ఈ చిత్రం మున్ముందు కూడా ఓటిటి లో విడుదలకాదు. కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది. విజువల్ వండర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే చూడాల్సిన సినిమా, ఇంట్లో చిన్ని తెరపై చుస్తే ఆ అనుభూతి పొందలేరు. మీరు ముందు యూట్యూబ్ ఛానల్ లో మూడు నిమిషాల థియేట్రీకల్ ట్రైలర్ చూడండి అది నచ్చితేనే సినిమా చూడండి” అన్నారు.

జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాత గా వ్యవహరించిన ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత,  పంపిణీదారుడు కరుణాకర్రెడ్డి, మరో పంపిణీదారుడు రాము, మార్కెటింగ్ ప్రొడ్యూసర్ బాలుపాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com