భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా… ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1 నుంచి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోయే జై షా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఐసీసీ చైర్మన్ ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జై షా(35) ఘనత దక్కించుకున్నారు. భారత్ నుంచి ఈ పదవి చేపడుతోన్న ఐదో వ్యక్తి. గతంలో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్ లు ఐసిసి ప్రెసిడెంట్ లుగా పనిచేయగా, 2016నుంచి ఐసిసి ప్రెసిడెంట్ పదవి స్థానంలో ఛైర్మన్ పదవి ఐసిసి బోర్డును నడిపించే విధంగా నిబంధనలు మార్చారు. ఆ తర్వాత ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లు ఛైర్మన్ లుగా పని చేశారు. ఇప్పుడు జై షా ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం చైర్మన్ గా గ్రెగ్ బార్క్ కొనసాగుతున్నారు. మరో దఫా కొనసాగడానికి ఆయన విముఖత చూపారు. దీంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో జై షా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా జై షా తన క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.2019లో తొలిసారి బిసిసిఐ కార్యదర్శిగా ఎన్నికయ్యారు, 22లో రెండోసారి ఆ పదవిని చేపట్టారు.