జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానాలో మొత్తం అన్ని స్థానాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించింది.
37౦ అధికరణ తరువాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. హర్యానాలో అక్టోబర్ 1 న పోలింగ్ జరగనుంది.
జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొదటి దశలో 24, రెండో దశలో 26, తుది విడతలో 40 సీట్లలో ఎన్నికలు జరగనున్నాయి,
హర్యానాలో మొత్తం 90 సీట్లకూ అక్టోబర్ 1 న ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు.
రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4 న జరగనుంది.