Sunday, January 19, 2025
HomeTrending News13న విజయనగరంలో పవన్ పర్యటన

13న విజయనగరంలో పవన్ పర్యటన

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎల్లుండి (13న) విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలో విఫలమైందని ఆరోపిస్తూ ‘జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని జనసేన వెల్లడించింది.  దీనిలో భాగంగా రాష్ట్రలోనే అతిపెద్ద లే ఔట్ అయిన గుంకలాం ను పవన్ సందర్శించి ఇళ్ళ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యేందుకు పవన్ కళ్యాన్ కాసేపటి క్రితం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ రాత్రి ప్రధానితో భేటీ అనంతరం రేపు విశాఖలోనే పవన్ బస చేసే అవకాశం ఉంది. ఎల్లుండి విజయనగరం టూర్ కు పవన్ వెళ్లనున్నారు.

Also Read ఇప్పటం బాధితులకు పవన్ ఆర్ధిక సాయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్