Wednesday, June 17, 2026
HomeసినిమాJanhvi Kapoor: జాన్వీ మరో భారీ ఆఫర్ వచ్చిందా..?

Janhvi Kapoor: జాన్వీ మరో భారీ ఆఫర్ వచ్చిందా..?

జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో తెలుగులో సినిమా చేస్తానని చెబుతూ వచ్చింది. బాలీవుడ్ లో మంచి నటి అనిపించుకుంది కానీ.. ఇంకా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం అక్కడ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది. అదే సమయంలో టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుంది. ఎన్టీఆర్ తో నటించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జాన్వీకి ఈ ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా ఫీలవుతుంది.

ఎన్టీఆర్ 30 షూటింగ్ లో జాన్వీ జాయిన్ అయ్యింది. అయితే… టాలీవుడ్ లో నటిస్తున్న సినిమా విడుదల కాకుండానే… జాన్వీ మరో భారీ ఆఫర్ దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే… రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశం దక్కించుకుందట. చరణ్‌ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో చరణ్‌ సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది. అఫిషియల్ గా ఈ సినిమాని ప్రకటించారు.

ఈ సినిమాలో కథానాయికగా జాన్వీని కన్ ఫర్మ్ చేశారని సమాచారం. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ సరసన నటించే అరుదైన అవకాశం దక్కించుకున్నట్టే. చరణ్ తో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బుచ్చిబాబు బిజీగా ఉన్నాడు. ఇందులో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తాడని, ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌‌ను, మరో హీరోయిన్‌గా  మృణాల్ ఠాకూర్‌‌ని తీసుకుంటారని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular