Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Women’s T20 WC: పాకిస్తాన్ పై ఇండియా విజయ భేరి

Women’s T20 WC: పాకిస్తాన్ పై ఇండియా విజయ భేరి

మహిళల టి 20 వరల్డ్ కప్ లో దాయాది పాకిస్తాన్ పై ఇండియా 7 వికెట్లతో అద్భుత విజయం సాధించింది. పాక్ విసిరిన 150 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. కొంతకాలంగా ఫామ్ లో లేని జెమీమా రోడ్రిగ్యూస్ ఈ మ్యాచ్ లో 53 (38 బంతుల్లో 8 ఫోర్లు) పరుగులతో అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించింది. రిచా ఘోష్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 31(నాటౌట్); షఫాలీ వర్మ 25 బంతుల్లో 4  ఫోర్లతో 33; యస్తికా భాటియా-17;  కెప్టెన్ హర్మాన్-16 రన్స్ సాధించారు.

కేప్ టౌన్ లోని న్యూ లాండ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బిస్మా మరూఫ్-68 (55 బంతుల్లో 7 ఫోర్లు) ; అయేషా నషీమ్-43 (25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో రాధా యాదవ్ రెండు; దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ సాధించారు.

జెమీమా రోడ్రిగ్యూస్ కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్