Sunday, February 23, 2025
HomeTrending Newsజార్ఖండ్ లో పడవ ప్రమాదం

జార్ఖండ్ లో పడవ ప్రమాదం

ఝార్ఖండ్ లో గురువారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బిర్గోన్ సమీపంలోని బార్బెండియా వంతెన దగ్గరకు రాగానే  పడవ బోల్తా పడటంతో.. 12 మంది దామోదర్ నదిలో గల్లంతయ్యారు. ధనబాద్ జిల్లాలోని నిర్సా నుంచి జాంతార నగరానికి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.  ప్రమాద సమయంలో పడవలో 18 మంది ఉండగా..National Disaster Response Force(NDRF) ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయంతో నలుగురు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.

గల్లంతైన 14 మంది కోసం జాంతార  జిల్లా యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తోంది. తుఫాన్ కారణంగా ఝార్ఖండ్ లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ కారణంగానే ఈ పడవ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో గాలింపు కష్టంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్