Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్అదొక్కటే నా తీరని కోరిక: జులన్ గోస్వామి

అదొక్కటే నా తీరని కోరిక: జులన్ గోస్వామి

భారత మహిళా క్రికెట్ వెటరన్ ప్లేయర్, పేస్ బౌలర్ జులన్ గోస్వామి తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకబోతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతోన్న మూడో వన్డే తరువాత ఆమె ఆటకు గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇన్నేళ్ళ తన కెరీర్ లో వరల్డ్ కప్ సాధించలేక పోవడం ఎంతో లోటుగా భావిస్తున్నానని చెప్పారు. జులన్ రెండు సార్లు భారత్ తరఫున మహిళా వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడారు. గోస్వామి మొత్తం ఐదు వరల్డ్ కప్ టోర్నమెంట్ లలో ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

2002 లో జాతీయ జట్టుకు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన జులన్ తన కెరీర్ లో 12 టెస్టులు, 68 టి20లు, 203వన్డే మ్యాచ్ లు ఆడారు. టెస్టుల్లో 44, వన్డేల్లో 253, టి20ల్లో 56 వికెట్లు సాధించారు. తొలిసారి తాను ఇండియన్ క్యాప్ ధరించడం తన జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకమని జులన్ వెల్లడించింది. తాను ఓ మారుమూల గ్రామం.. వెస్ట్ బెంగాల్, నదియా జిల్లాలోని చక్డా నుంచి వచ్చానని, మహిళా క్రికెట్ ఉంటుందని కూడా తన గ్రామంలో ఎవరికీ తెలియదని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు.  జులన్ 2008 నుంచి 11 వరకూ జట్టు కెప్టెన్ గా కూడా సేవలందించారు.

2010లో అర్జున అవార్డు, 2012లో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం జులన్ గొస్వామిని గౌరవించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్