Tuesday, December 3, 2024
HomeTrending Newsతెలంగాణ కొత్త డిజిపి జితేందర్

తెలంగాణ కొత్త డిజిపి జితేందర్

తెలంగాణ నూతన డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ఫలితాలు వెలువడక ముందే రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ ఆగ్రహించి బదిలీ చేసింది. ఆయన స్థానంలో రవి గుప్తాను నియమించింది.

ఎన్నికల ఫలితాల తర్వాత ..సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డీజీపీగా రవి గుప్తానే కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఇటీవలి కాలంలో వరుస ఘటనల కారణంగా డీజీపీని  మార్చాలని నిర్ణయానికి వచ్చి జితేందర్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి డీజీపీగా తొలి నియామకం జరిగింది. ప్రస్తుతం డీజీపీ హోదాలో ఉన్న ఆయన.. హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా… విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పంజాబ్ వాణిజ్య రాజధాని జలంధర్ లో రైతు కుటుంబంలో జితేందర్ జన్మించారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా, ఆ తర్వాత బెల్లంపల్లి ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఢిల్లీలో సీబీఐలో విధులు నిర్వర్తించి.. 2004,06 వరకు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. ఆతర్వాత డీఐజీగా ప్రమోషన్ తో.. విశాఖకు వెళ్లారు.

అప్పాలో పనిచేసి, వరంగల్ రేంజ్ డీఐజీగా సేవలందించారు. 14నెలల పాటు రాష్ట్ర పోలీసు బాస్ గా కొనసాగనున్న జితేందర్  2025 లో సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్