Friday, March 29, 2024
HomeTrending Newsబిఆర్ఎస్ లో చేరిన బీహార్ ముస్లిం కార్మికులు

బిఆర్ఎస్ లో చేరిన బీహార్ ముస్లిం కార్మికులు

బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లౌకిక వాదిగా దేశ వ్యాప్తంగా ఆదరణ పొందడం వల్ల పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన పలువురు కార్మికులు హోం మంత్రి సమక్షంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బద్రుద్దీన్ ఆధ్వర్యంలో బీహార్ నుండి వివిధ పార్టీలకు చెందిన యాభై మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు దేశంలోనే ప్రముఖ స్థానం కల్పించారని , దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహోరాత్రులు కృషి చేస్తున్నారన్నారు.నిత్యం ప్రజల సేవల్లో పార్టీ నిమగ్నమై ఉంటుందని మంత్రి తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు నిరంతరం బి ఆర్ ఎస్ పార్టీలో చేరడానికి ఇదే కారణమని, ఈ పార్టీలో అన్ని మతాల వారిని సమానంగా చూస్తామన్నారు. తమ తమ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, సేవకు నడుం బిగించాలని పార్టీలో చేరిన కార్యకర్తలకు సూచించారు.సామాజిక శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని హోం మంత్రి వారిని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్