Saturday, July 27, 2024
HomeసినిమాPrabhas, NTR, Yash: 'సలార్' లో ఎన్టీఆర్, యశ్. ఇది నిజమేనా..?  

Prabhas, NTR, Yash: ‘సలార్’ లో ఎన్టీఆర్, యశ్. ఇది నిజమేనా..?  

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ అని ప్రకటించినప్పటి నుంచి రోజురోజుకు సలార్ పై అంచనాలు పెరుగుతున్నాయి. మరో వైపు ఇదే డేట్ కి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ కానుంది. దీంతో ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర డంకీ, సలార్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ముందుగానే షారుఖ్ డంకీ విడుదల తేదీ ప్రకటించినప్పటికీ తగ్గేదేలే అన్నట్టుగా సలార్ అదే డేట్ కి వస్తుండడంతో బాలీవుడ్ మేకర్స్ కోపంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. సలార్ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ కామియో ఉంటుందని బెంగుళూరులో టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులు వెళ్లిపోకుండా సినిమా చూపించడానికి ఇదే టెక్నిక్ అని చెప్పచ్చు. హాలీవుడ్ సినిమాలకు ఈ టెక్నిక్ వాడుతుంటారు. స్పైడర్ మేన్, అవెంజర్స్, అవతార్ సినిమాలకు ఈ టెక్కిక్ బాగా ఉపయోగపడిందని… ఇప్పుడు సలార్ కు కోసం ప్రశాంత్ నీల్ కూడా ఈ టెక్నిక్ ఉపయోగించారని ప్రచారం జరుగుతుంది. దీతో సలార్ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది.

ఎన్టీఆర్ ఒక్కడే కాదు.. కేజీఎఫ్ యశ్ కూడా కామియో రోల్ లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. దీంతో ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, యశ్ కనిపించనున్నారనే వార్త వైరల్ అయ్యింది. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా ఇది నిజమేనా అంటే.. దేవర, వార్ 2 తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నారు. అలాగే యశ్.. ప్రశాంత్ నీల్ తో కేజీఎఫ్ 3 చేయాలి. అందుచేత ప్రశాంత్ నీల్ అడిగితే.. ఎన్టీఆర్, యశ్ నో చెప్పరు. కాబట్టి ఇందులో వీరిద్దరూ కామియో చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే కనుక జరిగితే.. సంచలనమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్