Thursday, May 30, 2024
HomeసినిమాRC16: చరణ్ మూవీలో రషా తడాని. అసలు నిజం ఇదే

RC16: చరణ్ మూవీలో రషా తడాని. అసలు నిజం ఇదే

రామ్ చరణ్‌ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించారు కానీ.. ఇప్పటి వరకు సెట్స్ పైకి రాలేదు. చరణ్ ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. రెండు మూడు రోజుల నుంచి ఈ సినిమాలో చరణ్‌ కు జంటగా రవీనా టాండన్ డాటర్ రషా తడాని నటించనుందని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా రషా తడాని హైదరాబాద్ వచ్చిందని.. ఫోటో షూట్ కూడా జరిగిందని.. చరణ్‌ కు జంటగా ఈ భామను ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఇంతకీ విషయం ఏంటని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే.. రషా తడాని హైదరాబాద్ రావడం.. ఫోటో షూట్ జరగడం నిజమే అని తెలిసింది. అయితే.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమా కోసం ఫోటో షూట్ చేశారట. అది చరణ్ సినిమా కోసమా..? లేక వేరే హీరోతో మైత్రీ సంస్థ చేయనున్న సినిమా కోసమా అనేది తెలియాల్సివుంది.

మరో వైపు చరణ్, బుచ్చిబాబు సినిమాకి సంబంధించి కథానాయికగా ఎవర్నీ ఫిక్స్ చేయలేదని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ రెడీగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. మరి.. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ కానుందో.. చరణ్‌ కు జంటగా ఎవరు నటిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్