Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ సరసన జాన్వీ కఫూర్.?

ఎన్టీఆర్ సరసన జాన్వీ కఫూర్.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో కుదరడం లేదు. ఆర్ఆర్ఆర్ వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను ఇటీవల ఎనౌన్స్ చేశారు. దీని తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనుంది.

పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ ను సంప్రదించినట్టు సమాచారం. బోనీ కపూర్ ను మైత్రీ మూవీస్ సంస్థ కాంటాక్ట్ చేసారని.. అయితే.. బోనీ కఫూర్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని తెలిసింది. ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది. అయితే.. జాన్వీ కపూర్ ను టాలీవుడ్ కి తమ సంస్థే పరిచయం చేయాలని మైత్రీ ప్రయత్నిస్తుందట. టాలీవుడ్ కి జాన్వీని పరిచయం చేయాలని టాప్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ గతంలో ప్రయత్నించారు కానీ.. బోనీ కపూర్ ఓకే చెప్పలేదు. మరి.. ఈసారైనా బోనీ కపూర్ ఓకే చెబుతారో..? లేదో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్