Friday, April 19, 2024
HomeTrending Newsయుఎన్  ఆర్థీక, సామాజిక మండలికి భారత్ ఎన్నిక

యుఎన్  ఆర్థీక, సామాజిక మండలికి భారత్ ఎన్నిక

అంతర్జాతీయ వేదికపై భారత్ కు మరోసారి సముచిత స్థానం దక్కింది. ఐక్యరాజ్యసమితి ముఖ్యమైన విభాగాల్లో ఒకటైన ఆర్థీక, సామాజిక మండలికి భారత దేశం ఎంపికైంది. ఈ మండలిలో ఇండియా 2022 నుంచి 2024 వరకు వరకు కొనసాగుతుంది. 54 దేశాలు సభ్యులుగా ఉన్న ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ (ECOSOC) యునైటెడ్ నేషన్స్ కు గుండె కాయ లాంటిది.

సుస్థిరమైన ఆర్థీక అభివృద్ధి, సామాజిక, పర్యావరణ రంగాల పరిరక్షణ కోసం ఆర్థీక, సామాజిక మండలి కృషి చేస్తుంది. ఈ మూడు అంశాల్లో అంతర్జాతీయంగా జరిగే ఒప్పందాలు, లక్ష్యాలపై చర్చలకు, నూతన విధానాలకు కేంద్ర స్థానంగా ఉండి ఒడిదుడుకులు లేకుండా అమలు అయ్యేట్టు చొరవ తీసుకుంటుంది.

ఆసియా – పసిపిక్ దేశాల కేటగిరిలో భారత తో పాటు ఆఫ్ఘానిస్తాన్, కజకిస్తాన్, ఒమన్ దేశాలు ఎన్నికయ్యాయి. ఆర్థీక, సామాజిక మండలికి ఎంపికపై యుఎన్ లో భారత దేశ శాశ్వత ప్రతినిధి టి ఎస్ తిరుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఇండియాపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్న ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు తిరుమూర్తి ధన్యవాదాలు తెలిపారు.

యునైటెడ్ నేషన్స్ ముఖ్యమైన ఆరు విభాగాల్లో ఒకటిగా ఉన్న ఆర్థీక, సామాజిక మండలిలో 54 దేశాలు సభ్యత్వం కలిగి ఉంటాయి. మూడేళ్ళ పదవీ కాలానికి సభ్యులను యుఎన్ జనరల్ అసెంబ్లీ  ఎన్నుకుంటుంది. ఆఫ్రికా నుంచి 14 దేశాలు, ఆసియా నుంచి 11 దేశాలు, యూరోప్ నుంచి ఆరు దేశాల్ని ఎంపిక చేస్తారు. వీటితోపాటు లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల నుంచి 10 దేశాలు, 13 దేశాల్ని పశ్చిమ ఐరోపా నుంచి ఎన్నుకొంటారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్