Monday, January 20, 2025
HomeTrending Newsమే 7 వరకు కేజ్రివాల్, కవితలకు రిమాండ్ పొడగింపు

మే 7 వరకు కేజ్రివాల్, కవితలకు రిమాండ్ పొడగింపు

మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని వచ్చే నెల 7వ తేదీ వ‌ర‌కు కోర్టు పొడిగించింది. 14 రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో అధికారులు ఆమెను న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు. ఢిల్లీ మ‌ద్యం విధానం మ‌నీలాండ‌రింగ్ కేసు ద‌ర్యాప్తు వివరాలు అందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ 60 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు వివరించింది.

మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ కు కూడా కోర్టు వచ్చే నెల 7 వరకు రేమాండ్ పొడగించింది. కేసు దర్యాప్తు  పురోగతిని ఈడి కోర్టుకు వివరించింది. దీంతో జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని మ‌రో 14 రోజులు పొడిగించాల‌ని కోరింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు.. జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని పొడిగిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

తీహార్ జైలులో ఉన్న నిందితుల్ని ఇవాళ వ‌ర్చువ‌ల్‌గా కోర్టు ముందు హాజ‌రుప‌రిచారు. కవిత బెయిల్ పై రేపు కూడా కోర్టులో వాదనలు జరగనున్నాయి. కవిత అరెస్తులో నిబంధనలు పాటించమని వివరించిన ఈడి కవితకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేందని పేర్కొన్నది.

ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో ఎన్నికల తంతు ముగిసేవరకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. 14 రోజుల చొప్పున ఇప్పటికి రెండుసార్లు జుడిషియల్ రిమాండ్ పొడగించిన కోర్టు ఇప్పుడు మూడోసారి పొడగించింది. చూడబోతే ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో ఎన్నికల తనత ముగిసే వరకు వచ్చేట్టుగా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అటు ఢిల్లీ సిఎం పరిస్థితి అదే విధంగా ఉంది. ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు మెజారిటీ సాధించినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక ట్రెండ్‌గా ఉంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ఢిల్లీలో మెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. 2014,2019లో బిజెపి నేతృత్వంలోని NDA కూటమి మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆ సెంటిమెంటు పునరావృతం చేసేందుకు బిజెపి దూకుడుగా ప్రచారం నిర్వహిస్తోంది. సిఎం అరవింద్ కేజ్రివాల్ జైలులో ఉండటంతో ఆప్ శ్రేణులు ఒకింత నిరుత్సాహాంతో ఉన్నాయి. మంత్రి అతిశీ, సిఎం భార్య పార్టీ నేతలను సమన్వయము చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆరో దశలో ఢిల్లీలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. ఢిల్లీ పరిధిలోని ఏడు లోక్ సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఆ లోగా కేజ్రివాల్ రాకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్