Friday, March 20, 2026
Homeసినిమాజూనియర్ పాటకు వెంక‌టేష్ 'మ‌హా' హ్యాపీ

జూనియర్ పాటకు వెంక‌టేష్ ‘మ‌హా’ హ్యాపీ

Asha Pasham : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 25న విడుద‌ల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ‌మౌళి ఇటీవలే దేశంలోని నాలుగు మూలలు చుట్టివచ్చారు. వివిధ ఛాన‌ల్స్ కు ఇంటర్ వ్యూలూ ఇచ్చారు. అయితే.. మలయాళ ప్రేక్షకుల కోసం ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఎన్టీఆర్.. ఇటీవల కాలంలో తన ఫోన్ లో ఎక్కువ సార్లు విన్న పాట ఆశా పాశం.. అనే పాట అని చెప్పారు.

కేరాఫ్ కంచర పాలెం‘ లోని ఆ పాట అంటే తనకెంతో ఇష్టమని చెప్పడ‌మే కాకుండా.. ఆ పాట‌ను ఎన్టీఆర్ పాడి వినిపించారు కూడా. ఈ విషయం తెలిసిన ఆ సినిమా దర్శకుడు వెంకటేశ్ మహా చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే.. అత‌నికి ఇది ఒక  బిగ్ సర్ ప్రైజ్ అని చెప్ప‌చ్చు. అందుక‌నే.. ఆ ఇంటర్ వ్యూలోని కొంత‌ భాగాన్ని ఎడిట్ చేసి ట్వీట్ చేస్తూ, ఎన్టీఆర్ కు వెంకటేశ్ మహా కృతజ్ఞతలు తెలియ‌చేశాడు. ఎన్టీఆర్ పాటిన ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  ఏది ఏమైనా చిన్న సినిమాలోని పాట త‌నకు బాగా న‌చ్చింద‌ని ఎన్టీఆర్ చెప్ప‌డం విశేషం

Also Read : బెనిఫిట్ షోల్లోనూ ఆర్ఆర్ఆర్ రికార్డులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular