Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: సెమీస్ కు సౌతాఫ్రికా

మహిళల వరల్డ్ కప్: సెమీస్ కు సౌతాఫ్రికా

SA in Semis: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ కు చేరగా రెండో జట్టుగా సౌతాఫ్రికా చేరింది. సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో మొదలైన నేటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రెండు జట్లూ చెరో పాయింట్ పొందాయి.

వెస్టిండీస్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇండియా, ఇంగ్లాండ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు దేశాల జయాపజయాలపై విండీస్ సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.

భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారజామున 3.30 గంటలకు మొదలు కావాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా పడింది. ఏడు గంటలకు మ్యాచ్ ను మొదలు పెట్టారు. అయితే మ్యాచ్ ను చెరో 26 ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 10.5 ఒవర్లపాటు మ్యాచ్ కొనసాగిన అనంతరం మళ్ళీ వాన మొదలు కావడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయిన సమయానికి సౌతాఫ్రికా 61 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. మిగ్నూన్ డుప్రెజ్ 38 పరుగులతో క్రీజులో ఉంది. విండీస్ బౌలర్లలో చినెల్లీ హెన్రీ మూడు; శామీలియా కన్నెల్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read : స్విస్ ఓపెన్: తొలి రౌండ్ లో ఇండియా ముందంజ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular