Saturday, January 18, 2025
Homeసినిమాపాన్ ఇండియా పదమే నచ్చదు : ఎన్టీఆర్

పాన్ ఇండియా పదమే నచ్చదు : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వలో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే.. ఈ షూటింగ్ కి కరోనా సెకండ్ వేవ్ వలన బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఎన్టీఆర్ కు కరోనా సోకింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న ఎన్టీఆర్.. ఓ ఇంటర్నేషనల్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఈ ఇంటర్వ్యూలో హాలీవుడ్ లో ఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. హాలీవుడ్ లో అవకాశం వస్తే.. ఎవరైనా చేస్తారు. నేను కూడా అంతే. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని ఎన్టీఆర్ తన మనసులోని మాట బయటపెట్టారు.

ఇప్పుడు భారతీయ సినిమా సరిహద్దులు దాటింది కాబట్టి ఛాన్స్ వస్తే ఎన్టీఆర్ ను ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో చూడొచ్చు. ఇక పాన్ ఇండియా సినిమాల గురించి అడిగినప్పుడు.. తనకు పాన్ అనే పదమే నచ్చదు అని చెప్పారు. పాన్ అంటే వంట పాత్ర గుర్తొస్తుందన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నానని.. ఆ సినిమాను భారతీయ భాషలన్నింటిలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నామని చెప్పారు. డైరెక్షన్ గురించి అడిగితే.. ఇప్పటి వరకు డైరెక్షన్ గురించి ఆలోచించలేదనన్నారు.

అయితే.. మంచి కంటెంట్ అందించాలని ఆలోచన ఉంది. దీనిని బట్టి ఎన్టీఆర్ నిర్మాణ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు నిర్మిస్తాడనుకోవచ్చు. గతంలో ఎన్టీఆర్ ఓ బ్యానర్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ మాటలను బట్టి భవిష్యత్ లో నిర్మాతగా మారి మంచి సినిమాలు నిర్మిస్తాడనుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్