Friday, April 19, 2024
Homeసినిమాఅంచనాలు పెంచేసిన 'కబ్జ' ట్రైల‌ర్

అంచనాలు పెంచేసిన ‘కబ్జ’ ట్రైల‌ర్

ఉప్రేంద్ర‌, సుదీప్‌, శివ రాజ్‌కుమార్ ల కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ‘కబ్జ’.ఈ చిత్రానికి ఆర్. చంద్రు దర్శకత్వం వహించారు. 1960 కాలంలో జ‌రిగిన అండ‌ర్ వ‌రల్డ్ క‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఉపేంద్ర గ్యాంగ్‌స్టర్ పాత్ర‌లో న‌టించారు. శ్రియా శ‌ర‌న్‌, క‌బీర్ దుహాన్ సింగ్‌, న‌వాబ్ షా, ప్ర‌మోద్ శెట్టి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌వి బ‌స్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌గా, ఏజే శెట్టి సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జ‌యంతి సంద్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్.. ఈ ‘కబ్జ’ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ట్రైలర్‌ని అమితాబ్ రిలీజ్ చేసి సినిమా చాలా పెద్ద స‌క్సెస్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. పాన్ ఇండియా మూవీగా క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌ భాష‌ల్లో మార్చి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క నిర్మాణంలో సిద్దేశ్వ‌ర ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంద్ మోష‌న్ పిక్చ‌ర్స్, ఇన్‌వెనియో ఆరిజ‌న్‌, బ్యాన‌ర్‌పై ‘కబ్జ’చిత్రం రూపొందింది. దీన్ని తెలుగులో ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ ప‌తాకాల‌ పై రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ కు అన్ని భాషల్లో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండడంతో కబ్జ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్