Kajal Agarwal: మళ్లీ బిజీ అవుతున్న కాజల్!

తెలుగు తెర చందమామగా కాజల్ కి మంచి పేరు ఉంది. ఆమె తన కెరియర్ ను మొదలెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఈ సుదీర్ఘమైన కెరియర్లో ఆమె తెలుగు .. తమిళ సినిమాలు ఎక్కువగా చేసింది. అడపా దడపా హిందీ సినిమాలు చేస్తూ వెళ్లింది. కన్నడ .. మలయాళ సినిమాలపై ఆమె పెద్దగా దృష్టిపెట్టింది లేదు. ఈ గ్లామర్ ఫీల్డ్ లో ప్రతిరోజు ఎంతోమంది హీరోయిన్స్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అలాంటి ఈ పోటీ రంగంలో 20 ఏళ్లపాటు కొనసాగడం అంత  తేలికైన విషయమేం కాదు.

ఇలియానా .. తమన్నా .. త్రిష వంటి హీరోయిన్స్ నుంచి ఉన్న పోటీని తట్టుకుని కాజల్ నిలబడటం విశేషం. అవకాశాల కోసం ఆమె వెతుక్కునే పరిస్థితి రాకుండానే ఇంతవరకూ తన కెరియర్ ను నెట్టుకొచ్చింది. ఒకానొక దశ నుంచి సీనియర్ స్టార్స్ కి జోడీగా నటించడం మొదలుపెట్టింది. ఇటీవల వ్యక్తిగత కారణాల వలన ఆమె కొన్ని సినిమాలు వదులుకుంది. ఇక కాజల్ ఈ ఫీల్డ్ నుంచి పూర్తిగా తప్పుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటివారి అంచనాలను ఆమె తలక్రిందులు చేసింది.

మళ్లీ ఆమె కొత్త ప్రాజెక్టులకి సైన్ చేయడం మొదలుపెట్టింది. తెలుగు .. తమిళ భాషల్లో భారీ సినిమాల్లో .. సీనియర్ స్టార్స్ సరసన అవకాశాలను అందుకుంటోంది. అంతేకాదు భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే వెబ్ సిరీస్ లలోను ఆమె నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె ‘బాలకృష్ణ 108’వ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇక పాన్ ఐడియా సినిమాగా శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాలో ఆమె కమల్ జోడీగా కనిపించనుంది. కాజల్ కెరియర్ గ్రాఫ్ ను మరికొంతకాలం పరిగెత్తించడానికి ఈ రెండు సినిమాలు సరిపోతాయని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *