Sunday, January 19, 2025
Homeసినిమా'పుష్ప 2' లో కాజ‌ల్?

‘పుష్ప 2’ లో కాజ‌ల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ మూవీ బాలీవుడ్ ని షేక్ చేయ‌డంతో పుష్ప 2 పై ఆకాశ‌మే హ‌ద్దు అనేలా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అక్టోబ‌ర్ 1న పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

ఇప్పుడు పుష్ప 2 లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నుంద‌ని.. అది కూడా ఐటం సాంగ్ చేయ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం రాంగ్ సెలక్షన్ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ జ‌నాలు కూడా దీని గురించి చ‌ర్చించుకుంటున్నారు. ఈ విషయం పై చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి స్పష్టత లేదు. దీంతో ఇది కేవలం పుకారు మాత్ర‌మే అంటున్నారు.

బన్నీ ఫ్యాన్స్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పుష్పలో సమంతతో ఐటెం సాంగ్ చేయించారు. ఊ అంటావా.. పాటకు సమంత మాస్.. హాట్ స్టెప్పులు ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టాయి అనడంలో సందేహం లేదు. అలాంటిది పుష్ప 2 ఐటం సాంగ్ అంతకు మించి అనేలా ఉండాలి కదా అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ తో ఐటం సాంగ్ చేయించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త పై మేక‌ర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : ‘పుష్ప-2’ షూటింగ్ కి ముహుర్తం ఫిక్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్