Saturday, January 18, 2025
Homeసినిమాపాపం.. కాజల్ కష్టం ఫలించలేదే! 

పాపం.. కాజల్ కష్టం ఫలించలేదే! 

వెండితెరపై కథానాయికగా ఎక్కువ కాలం పాటు తన జోరును కొనసాగించినవారిలో కాజల్ కూడా కనిపిస్తుంది. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఆమె వరుస విజయాలను అందుకుంటూ వెళ్లింది. ఆ సమయంలో మిగతా హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, ఆమె తట్టుకుని నిలబడింది. కాజల్ తో పాటు జర్నీ మొదలుపెట్టిన చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు బరిలో లేరు. కానీ ఆమె మాత్రం తన స్పీడ్ చూపిస్తూనే ఉంది.

ఈ మధ్య కాలంలో ఆమె ఒక వైపున సీనియర్ హీరోలతో చేస్తూనే, నాయిక ప్రాధాన్యత కలిగిన కథలను ఎంచుకుంటూ వెళుతోంది. అలా ఆమె చేసిన ‘సత్యభామ’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆమె చేసిన సినిమా ఇది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాజల్ బాగానే హడావిడి చేసింది. కాకపోతే ఈ సినిమా ఆశించినస్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకోలేకపోయింది. కథాకథనాలు రొటీన్ గా ఉండటం ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఈ సినిమా యాక్షన్ జోనర్ కి సంబంధించినది కావడంతో కాజల్ చాలా కష్టపడింది. ఆమె పాత్ర వరకూ .. నటన వరకూ వంకబెట్టలేం. కానీ కంటెంట్ పెర్ఫెక్ట్ గా లేకపోవడం వలన ఆమె కష్టం ఫలించకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక కాజల్ నుంచి ‘భారతీయుడు 2’ రానుంది. ఈ సినిమాలో కాజల్ చాలా గ్లామరస్ గా కనిపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ‘భారతీయుడు’లో సుకన్య తరహాలో ఆమెను గుర్తుపట్టలేని లుక్ తో కనిపిస్తుందని అంటున్నారు.   చూడాలి మరి ఈ సినిమా కాజల్ గ్రాఫ్ ను పెంచుతుందేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్