Sunday, June 28, 2026
Homeసినిమాసూప‌ర్ స్టార్ సాంగ్.. స‌రికొత్త రికార్డ్

సూప‌ర్ స్టార్ సాంగ్.. స‌రికొత్త రికార్డ్

Kalaavathi records: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట‘. ఈ చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టిస్తుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. అయితే.. రీసెంట్ గా ఈ మూవీనుంచి కళావతి సాంగ్ ను విడుదల చేశారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అదించిన ఈపాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గట్లుగా ఉంది. తాజాగా ఈ పాట మహేష్ ఖాతాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కళావతి డ్యాన్స్ ఛాలెంజ్ ను మహేష్ కూతురు సితార ఇన్ స్టా లో షేర్ చేయడంతో అనూహ్యంగా ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. సితార ఛాలెంజ్ ను స్వీకరించిన పలువురు సినిమా తారలు ఈ పాట హుక్ స్టెప్ ను చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ పాటకు తెలుగు ఇండస్ట్రీలో అత్యంత స్పీడ్ గా మిలియన్ లైక్స్ దక్కాయి. ఇప్పటికే ఈపాట 70 మిలియన్ వ్యూస్ తో  దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కి 100 మిలియ‌న్ వ్యూస్ కి చేరుకుంటుంది అంటున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక ఈ సినిమాను మే 12వ తారీఖున‌ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular