Kaleswaram Palamuru Projects Kcr Two Eyes :
టీ ఆర్ ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని రైతులకు మేలు జరుగుతుంటే కొందరు పొలిటికల్ టూరిస్ట్ లు రాష్ట్రానికి వచ్చి ఎదో మాట్లాడుతున్నారని టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే టీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రం లో రైతులకు అన్నీ కష్టాలే.. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ వరస క్రమం లో మొదటి స్థానమే కాదు.. రైతుల ఆత్మ హత్యల్లో కూడా మొదటి స్థానం. దిగుబడుల్లో చివరి స్థానంలో ఉండేదని కేటిఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ తెలంగాణభవన్ లో ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే టీ రామారావు అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఎంత మారిందో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించాలని కోరారు. అపుడు ఊర్లకు ఊర్లె వల్లకాడు గా మారాయని, అపుడు కరెంటు లేదు పెట్టుబడి సాయం లేదు. పంట దిగుబడులు లేవన్నారు. మీడియా లో అపుడు రైతుల దుస్థితి గురించి వచ్చిన కథనాలు చూస్తే ఇపుడు పరిస్థితి ఎంత మారిందో అర్థమవుతుందన్నారు.
తెలంగాణలో వలసల దుస్థితి అంతరించిందని, రైతుల దర్జా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. భూముల ధరలు, రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయని, తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు ట్రైనీ ఐఏఎస్ లకు పాఠ్యంశాలు గా మారాయన్నారు. fci గోడౌన్ల లో పట్టనంత ధాన్యం తెలంగాణ నుంచి వస్తోంది నిజం కాదా అన్నారు.
రైతు బంధు పెట్టుబడి సాయం కాంగ్రెస్ నేతల అకౌంట్ల లో పడటం లేదా. కావాలంటే నా దగ్గర రికార్డులు ఉన్నాయన్నారు. వేరే రాష్ట్రాలు కూడా రైతు బంధును అనుసరిస్తున్నాయని, 50 వేల కోట్ల ముల్లె ప్రతి పల్లెను చేరిందన్నారు. ఆసరా పెన్షన్ల ను విమర్శించే రాజకీయ నాయకుల తల్లి దండ్రులు దాన్ని తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నాలుగు లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశాము. మిగతాది దశల వారీ గా చేస్తామన్న కేటిఆర్ కాంగ్రెస్ రెండు లక్షల రుణాల మాఫీ చేస్తామన్న ప్రజలు నమ్మకుండా మాకే రెండో సారి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. రైతు బీమా రైతు కు రక్షణ కవచంగా మారిందని, రైతు బీమాతో కేసీఆర్ రైతులకు అన్నగా మారారని, రైతు బీమా కు 3205 కోట్ల మేర ప్రీమియం కట్టామని వెల్లడించారు. 70 వేల మంది రైతుల కు రైతు బీమా తో ప్రయోజనం జరిగిందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచం లో ఎక్కడా లేదన్నారు.
కేంద్రం నుంచి అర పైసా సాయం లేకున్నా కాలం తో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని, జాతీయ పార్టీ లకు మమ్మల్ని విమర్శించే మొహం ఉందా .ఎక్కడైనా ఇంత వేగంగా ప్రాజెక్టు కట్టారా అన్నారు. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లు కేసీఆర్ కు రెండు కండ్లు అని పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ కు వరప్రదాయిని అయితే కాళేశ్వరం ఉత్తర తెలంగాణ కు ఊపిరి అన్నారు. పాలమూరు కొందరు దుర్మార్గుల కోర్టు కేసులతో కొంత ఆలస్యంవుతోంది అయినా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పాలమూరు బీడు భూములకు ఖిల్లా గా ఉండేది. ఇపుడు చేపల చెరువులకు అడ్డా గా మారిందన్నారు.
ప్రాథమిక రంగాల్లో తెలంగాణ వృద్ధి రేటు 8 శాతానికి పెరిగింది తెలంగాణ వచ్చినపుడు అది1.8 శాతమే ఉండేదని, తెలంగాణ gdp పెరగడానికి రైతన్నల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. మండు వేసవి లోనూ తెలంగాణ లోచెరువులు మత్తడ్లు దుంకుతున్నాయని, తెలంగాణ లో హార్వెస్టర్ల, ట్రాక్టర్ల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిందన్నారు. ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉందన్నారు. సస్య విప్లవం,వ్యవసాయ విప్లవం, గులాబీ విప్లవం(పశు సంపద అభివృద్ధి),శ్వేత విప్లవం, నీలి విప్లవం గట్టిగా అమలు చేస్తున్నామని, వ్యవసాయం అనుబంధ విభాగాలకు 2 లక్షల 71 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని మంత్రి వివరించారు.
నేను తెలంగాణ భవన్ వేదిగ్గా సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే రైతులకు వేరే రాష్ట్రాల్లో ఇంత మేలు ఏదైనా చేశారో చెప్పండి. చర్చకు సిద్ధమని కాంగ్రెస్, బిజెపి లకు సవాల్ విసిరారు. మేము శ్వేత పత్రాలు ఇస్తున్నాం నల్ల చట్టాలు కాదన్నారు. రాజకీయ పర్యాటకులు వస్తే అభ్యంతరం లేదు. తెలంగాణ పర్యాటక రంగానికి అది మేలు చేస్తుండొచ్చు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు .గణాంకాలు ఉంటే చెప్పండని హితవు పలికారు. nda అంటే నో డేటా ఆవేలేబుల్ ప్రభుత్వమని మా కంటే ఎక్కువ రుణ మాఫీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పండి. విమర్శించే వాళ్లకు నెత్తి లేదు కత్తి లేదని మంత్రి కేటిఆర్ ఎద్దేవా చేశారు.
Also Read : తెలంగాణలో బూస్టర్ డోసు ప్రారంభం