Friday, April 19, 2024
Homeసినిమానిర్మాత‌గా క‌ళ్యాణ్ కృష్ణ రాణించేనా?

నిర్మాత‌గా క‌ళ్యాణ్ కృష్ణ రాణించేనా?

Lambasingi: టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా న‌టించిన‌ ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో ద‌ర్శ‌కుడిగా మారి.. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌ ఆ త‌ర్వాత‌ నాగ‌చైత‌న్య‌తో రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా తెర‌కెక్కించారు. ఈ సినిమాతో కూడా స‌క్సెస్ సాధించాడు. ఆత‌ర్వాత ర‌వితేజ‌తో నేల టిక్కెట్ రూపొందించాడు. ఈ మూవీ ప్లాప్ అయ్యింది. అయిన‌ప్ప‌టికీ.. నాగార్జున మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు. అదే బంగార్రాజు.

సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బంగార్రాజు చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇలా ద‌ర్శ‌కుడుగా స‌క్సెస్ సాధించిన క‌ళ్యాణ్ కృష్ణ ఇప్పుడు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్ బాస్ లో పాల్గొని పాపులారిటీ తెచ్చుకున్న భామ దివి. ఆమెని హీరోయిన్ గా పరిచయం చేస్తూ కళ్యాణ్ కృష్ణ సమర్పణలో జీకే మోహన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘లంబ సింగి’ అనే పేరు ఖరారు అయింది. ఎ ప్యూర్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్.

భరత్ అనే యువకుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం నుండి మొదటి పాట ‘నచ్చేసిందే నచ్చేసిందే’ త్వరలో విడుదల కానుంది. ఈ పాటకు సంబధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ మెలోడీని సిద్ శ్రీరామ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. మ‌రి.. ద‌ర్శ‌కుడిగా రాణించిన క‌ళ్యాణ్ కృష్ణ నిర్మాత‌గా కూడా రాణిస్తాడేమో చూడాలి.

Also Read : పెళ్లి బంధంతో ఒక్కటైన ప్రేమ పక్షులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్