Good Friday: కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.