Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరింది..?

ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరింది..?

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న దేవర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెల 20 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. ఈ సినిమా కంటే ముందుగా బాలీవుడ్ మూవీ వార్ 2 చేయనున్నారు.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌ ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెంచేసింది. సలార్ వర్క్ ఫినిష్ అవ్వకముందే నెక్ట్స్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు ప్రశాంత్ నీల్‌. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఏంటా వార్త అంటే.. ఎన్టీఆర్‌ తో ప్రశాంత్ నీల్ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలో నటించబోతున్నారట.

విక్రమ్ సక్సెస్‌ తర్వాత కమల్‌ హాసన్‌ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. రీసెంట్‌గా ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కేలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలోనూ కమల్‌ నటిస్తున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, కమల్ హాసన్ ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తారని వార్తలు వస్తుండడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ఇదే నిజమైతే.. సినిమా చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్