Sunday, January 19, 2025
HomeTrending NewsPalace War: ప్యాలెస్ ఏదో తేలుద్దామా?: కన్నబాబు సవాల్

Palace War: ప్యాలెస్ ఏదో తేలుద్దామా?: కన్నబాబు సవాల్

రాష్ట్రంలో రైతు అంటే గుర్తొచ్చేది నాడు వైయస్సార్,  నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీమంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు.  రైతులకు వైయస్, జగన్ ల పాలనలో జరిగిన మేలు .. గతంలో బాబు పాలనలో  జరిగిన మేలుపై బహిరంగ చర్చికు సిద్ధం కావాలని ఆయన సవాల్ చేశారు.  చంద్రబాబు ఇప్పుడు రైతులకు పట్ల ప్రేమ ఒలకబోయడం  హాస్యాస్పదంగా ఉందన్నారు.  రైతు రుణమాఫీ హామీ ఇచ్చి… దాన్ని అమలు చేయలేని చరిత్ర చంద్రబాబుదని  గుర్తు చేశారు. సిఎం జగన్  రైతులకు చెప్పిందానికంటే ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్నారని వెల్లడించారు.

చంద్రబాబు విలేకరులను అవమానించేలా మాట్లాడటం సరికాదని కన్నబాబు ఆక్షేపించారు దమ్ముంటే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి గాని అలా వారిని కించపరిచేలా మాట్లాడడం సబబు కాదన్నారు. తనకు బాగా ఊదే చానల్స్ ను మాత్రమే ఆహ్వానిస్తూ… టీవీ9 ,ఎన్టీవీ, సాక్షిలాంటి ఛానల్స్ ను బాయికాట్ చేయడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు.

చంద్రబాబు మాటిమాటికి తాడేపల్లి ప్యాలెస్ అంటూ మాట్లాడడంపై కన్నబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు దమ్ముంటే నచ్చిన విలేకరితో తాడేపల్లి సీఎం ఇంటిని,  హైదరాబాద్ లోని బాబు నివాసాన్ని వీడియో తీసి బయటకు విడుదల చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. అప్పుడు ఎవరిది నిజమైన ప్యాలేస్సో అందరికీ తెలుస్తుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్