Friday, March 29, 2024
HomeTrending NewsKarnataka: బొట్టు చెరిపేసుకునే పార్టీలు అవసరమా - బండి సంజయ్

Karnataka: బొట్టు చెరిపేసుకునే పార్టీలు అవసరమా – బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినవ గరళకంఠుడు అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు చిమ్ముతున్న విషాన్ని 8 ఏళ్లుగా కంఠంలో దాచుకుంటూ ప్రజల కోసం పనిచేస్తూ దేశాన్ని అభివ్రుద్ధివైపు నడిపిస్తున్నారని అన్నారు. ఓ వర్గం వాళ్ల ఇంటికిపోయి మల్లిఖార్జున ఖర్గే బొట్టును ఎందుకు చెరిపివేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొట్టు చెరిపేసుకునే వాళ్ల పార్టీలకు కర్నాటక ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. కర్నాటక ఎన్నికల్లో భాగంగా చింతామణి అసెంబ్లీ నియోజకవర్గంలో కోలార్ ఎంపీ మునిస్వామి, బీజేపీ అభ్యర్ధి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జెనవాడె సంగప్పలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

చింతామణిలో యూత్ ఎక్కువ కన్పిస్తోంది. కోవిడ్ సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ వాళ్లు ఎవరైనా వచ్చారా? బీజేపీ అభ్యర్ధి వేణుగోపాల్ కరోనా సమయంలో మీవద్దకొచ్చి పీపీఈ కిట్లు ఇచ్చారు. 12 వేల మందికి సర్జరీలు చేశారు. రైతులకు సాయం చేశాడు. విద్యార్థులకు చదువు చెప్పించిండు. నారాయణగురు, ముక్తేశ్వర దేవాలయమున్న పవర్ ఫుల్ ప్లేస్ చింతామణి, ఇక్కడ బీజేపీని గెలిపించాలి. మీరు వేసే ఓట్లు సరిపోవు… ఒక్కొక్కరు వంద ఓట్లు వేయించాలి. కర్నాటకలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో అభివ్రుద్ధి చేసింది. మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకపోతే అభివ్రుద్ధి ఆగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ కర్నాటకను ఏటీఎంలా వాడుకుంటోంది. దేశమంతా ఎన్నికల ప్రచారానికి డబ్బులు సమకూర్చుకోవడానికే కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకుంటుంది.

కర్నాటకను ఎట్లా అభివ్రుద్ధి చేయాలనే అంశంపై కాంగ్రెస్ నేతలకు ప్లాన్ లేదు.. బీజేపీని ఓడించాలే.. కర్నాటక అభివ్రుద్ధిని ఆపాలే. నిధులు కొల్లగొట్టి దేశమంతా ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలనే యావ తప్ప కాంగ్రెస్ కు మరొకటి లేదు. చింతామణిలో కొంతమంది రెచ్చిపోతున్నరు. ఒకవర్గానికి కొమ్ముకాస్తున్నరు. చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డ గూండా నాకొడుకులను, మత చాందస వాదులకు షెల్టర్ ఇచ్చిన వాళ్లకు షెల్టర్ ఇచ్చిన వాళ్ల అంతు చూడాలా? వద్దా?

కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్ధం కావడం లేదు. ముస్లిం మతపెద్ద ఇంటికి పోయి బొట్టు తీసేసిండు.. అట్లాంటి వాళ్లు, అట్లాంటోళ్ల పార్టీ కర్నాటక ప్రజలకు అవసరమా? అసలు బొట్టు ఎందుకు చెరిపేసుకున్నడో.. మల్లిఖార్జున ఖర్గే ప్రజలకు సమాధానం చెప్పాలే. నరేంద్రమోదీని విష సర్పమని అంటున్నడు… ఈ దేశాన్ని అభివ్రుద్ధి చేస్తే విష సర్పమా? పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తున్నందుకా? స్వచ్ఛ భారత్ పేరిట టాయిలెట్లు, మహిళలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నందుకు విష సర్పం అవుతాడా? ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు జాతీయ రహదారులను అభివ్రుద్ధి చేస్తున్నందుకు, గ్రామాలకు నేరుగా నిధులిస్తూ అభివ్రుద్ధి చేసినందుకా విష సర్పమా? కాంగ్రెస్ గెలిస్తే పీఎఫ్ఐ పై నిషేధం ఎత్తివేస్తామంటున్నారు. ఒప్పుకుందామా? ప్రసక్తే లేదు… పీఎఫ్ఐని కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్