Sunday, June 14, 2026
Homeసినిమాకార్తికేయ సినిమా టైటిల్ 'బెదురులంక 2012'

కార్తికేయ సినిమా టైటిల్ ‘బెదురులంక 2012’

యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా ఓ రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై ప్రొడక్షన్ నంబర్ 3గా దీన్ని నిర్మిస్తున్నారు. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బెదురులంక 2012’ టైటిల్ ఖరారు చేశారు. నేడు (సెప్టెంబర్ 21) కార్తికేయ గుమ్మకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించారు.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ… “మా హీరో కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బ‌ర్త్‌డేకు టైటిల్ వెల్లడించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. ‘స్వర్గీయ’ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు” అన్నారు.

Also Read: కార్తికేయ టీమ్ తో రాఘవేంద్రరావు ముచ్చట్లు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular