Saturday, November 23, 2024
Homeసినిమాఅలా.. అభిమానంతో ఈ టైటిల్ పెట్టుకున్నాను : కార్తికేయ

అలా.. అభిమానంతో ఈ టైటిల్ పెట్టుకున్నాను : కార్తికేయ

Karthikeya Is Happy About His Roles In Different Genres

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ.. ఈ పేరు చెబితే ముందుగా ఆర్ఎక్స్ 100 సినిమా గుర్తుకువస్తుంది. అటువంటి న్యూ ఏజ్ సినిమా చేయడానికి ధైర్యం కావాలి. కార్తికేయకు ధైర్యం ఉంది కాబట్టే ఆ సినిమా చేశారు. హీరోగా ఆర్ఎక్స్ 100 వంటి విజయం తర్వాత విల‌న్‌గా నటించడానికి ధైర్యం కావాలి. గ్యాంగ్ లీడర్ లో స్ట‌యిలిష్‌ విల‌న్‌గా నటించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘చావు కబురు చల్లగా’ వంటి వైవిధ్యమైన సినిమా చేశారు. ‘రాజా విక్ర‌మార్క’ మూవీలో ఎన్ఐఏ ఏజెంట్‌గా నటిస్తున్నారు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకం  పై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క‘. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా, తాన్యా రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన చిత్ర విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

నేను ఇప్పటివరకూ ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇందులో యాక్షన్ కూడా స్ట‌యిలిష్‌గా ఉంటుంది. ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్రెస్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను టచ్ చేయని జానర్ సినిమా. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది.? అనే ఉత్కంఠతో అటు వినోదం కూడా ఉంటుంది. ప్రతి పాత్ర, వినోదం కథలో భాగంగానే ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటాయి. మా ’88’ రామారెడ్డి, ఆదిరెడ్డి గారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. రెండు కరోనా వేవ్స్ వచ్చినా… థియేటర్లలో రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆల్రెడీ నేను యాక్షన్ మూవీ చేశాను కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్షన్ చేసినంత ఎక్కువగా కామెడీ చేయలేదు. ఈ మూవీలో ఉన్నట్టు చేయలేదు. కష్టం అని కాదు గానీ… నా మీద హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్టెన్స్ రాలేదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అని క్యూరియాసిటీ ఉంది. బేసిగ్గా… నేను బయట చాలా జోవియ‌ల్‌గా ఉంటాను. జోక్స్ వేయడం, ఫ్రెండ్స్ మీద పంచ్ డైలాగ్స్ వేయడం ఎక్కువ. అందువల్ల, కామెడీ చేయడం కష్టం ఏమీ అనిపించలేదు. బయట ఎలా ఉంటానో అలా నటిస్తే క్యారెక్టర్ చేయవచ్చని అనిపించింది. డైరెక్టర్ కూడా అదే చెప్పాడు. ట్రైలర్ విడుదలయ్యాక కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యాను.

డైరెక్ట‌ర్ శ్రీ సరిపల్లి కథను నేరేట్ చేశాక… పది నిమిషాలు మాట్లాడిన తర్వాత అతను చేయగలడని నమ్మకం వచ్చింది. హానెస్ట్ పర్సన్ అనిపించాడు. స్క్రిప్ట్ నచ్చింది. అయితే… సినిమా చూస్తే గానీ చెప్పలేం. ఇటువంటి స్క్రిప్ట్ వినడానికి బావుంటుంది. కానీ, కరెక్ట్ విజువల్, మ్యూజిక్ పడినప్పుడు స్క్రీన్ మీద చూడటానికి బావుంటుంది. మేకింగ్ డిపెండ్ అయిన సినిమా. శ్రీని కలిసినప్పుడు అతను చేయగలడని అనిపించింది. ఒక్కో షెడ్యూల్ అవుతున్నప్పుడు నా నమ్మకం మరింత బలపడింది.

శ్రీ ముందు ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. ‘రాజా విక్రమార్క’ టైటిల్ సౌండింగ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాజిటివిటీ… చిరంజీవి గారి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు.  టైటిల్ పెట్టిన తర్వాత చిరంజీవి గారికి చెప్పాను. ముందు టైటిల్ దొరుకుతుందో? లేదో? అని చెక్ చేశాం. టైటిల్ ఉందని తెలిశాక రిజిస్టర్ చేశాను. తర్వాత ఆయనకు పంపించాను. గుడ్ లక్ అని చెప్పారు. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని ఒక సంతోషం. ఆయన సినిమా టైటిల్స్ అన్నీ ఆయనవే. కొంత మంది అభిమానులు పిల్లలకు తమ అభిమాన హీరో పేరు పెట్టుకుంటారు. అలా అభిమానంతో పెట్టుకున్నాను.

యువి క్రియేషన్స్ సంస్థలో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. శివలెంక కృష్ణప్రసాద్ గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయ్యింది. అన్నీ డిఫరెంట్ జానర్ సినిమాలు. వలిమై సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందులో నటించడం వల్ల తమిళం నుంచి అవకాశాలు వస్తున్నాయి.. అంటూ వివరించారు కార్తికేయ.

Also Read :నవంబర్ 12న కార్తికేయ ‘రాజా విక్ర‌మార్క‌’ విడుదల

Also read : హి ఈజ్ వెరీ స్వీట్ అండ్ ఫ్రెండ్లీ : తాన్యా రవిచంద్రన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్