Monday, June 15, 2026
Homeసినిమాహీరో కార్తి ‘నా పేరు శివ 2’ విడుదల వాయిదా

హీరో కార్తి ‘నా పేరు శివ 2’ విడుదల వాయిదా

Karthi movie postponed: కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘నా పేరు శివ 2’. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. కబాలి, సార్పట్ట పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ ‘నా పేరు శివ 2’కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో కార్తి స‌ర‌స‌న‌ క్యాథరైన్ ట్రెసా నాయికగా నటించింది.

నా పేరు శివ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. దీంతో నా పేరు శివ 2 టైటిల్ తో వ‌స్తున్న ఈ సినిమా పై ఫ‌స్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమా‌ను రిలీజ్ చేయాలని నిర్మాత‌ ప్లాన్ చేశారు. అయితే.. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు మెరుగపడిన వెంటనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular