Tuesday, April 16, 2024
Homeసినిమా‘అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి’ ఆల్బమ్ సాంగ్ పోస్టర్ రిలీజ్

‘అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి’ ఆల్బమ్ సాంగ్ పోస్టర్ రిలీజ్

Pelli-Lolli: నటుడిగా, క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ.. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా ‘అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి’ అనే ఆల్బమ్ సాంగ్ లో నటించాడు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం.

ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అంటూ చిత్ర యూనిట్ ను అభినందించారు. రవి జంగం దర్శకత్వంలో రావుతున్న ఈ సాంగ్ కు హర్ష గన్నోజి సంగీతం అందించారు. అఖిల్ కట్ట సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను గ్రాండ్ గా నిర్మిచారు బిందు అఖిలేష్. త్వరలో ఆల్బమ్ సాంగ్ ను ప్రముఖ కోరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్