Wednesday, March 12, 2025
HomeTrending News11న విచారణకు హాజరవుతా - ఎమ్మెల్సీ కవిత

11న విచారణకు హాజరవుతా – ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడి నుంచి తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు మరియు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారు.

హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడిని కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయo చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు. ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు.

దేశ పౌరురాలిగా ఒక మహిళగా చట్టపరమైనటువంటి అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని తేల్చి చెప్పారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు.

Also Read : ఢిల్లీ మద్యం కుంభకోణంలో.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్