Wednesday, March 18, 2026
HomeTrending NewsKandhar Loha:మహారాష్ట్రలో రైతుబందు తీసుకొస్తాం - కెసిఆర్

Kandhar Loha:మహారాష్ట్రలో రైతుబందు తీసుకొస్తాం – కెసిఆర్

బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో మహారాష్ట్రలో సృష్టించబోయే రైతు తుఫాన్‌ను ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మహారాష్ట్ర గడ్డపై గర్జించారు. నన్ను మహారాష్ట్రకు రావొద్దని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ అంటున్నడు. తెలంగాణ తరహా రైతు మాడల్‌ను మహారాష్ట్రలో అమలు చేసేదాకా బరాబర్‌ వస్తా. రైతులతో కలిసి పోరాటం చేస్తూనే ఉంటా అని ప్రకటించారు. బీఆర్‌ అంబేద్కర్‌ వంటి అమూల్య వజ్రం పుట్టిన గడ్డమీద దళితబంధు వంటి పథకం తెచ్చేదాక మహారాష్ట్రకు వస్తూనే ఉంటానని స్పష్టంచేశారు. నాందేడ్‌ జిల్లా కంధార్‌ లోహాలో ఆదివారం జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ మహాగర్జన చేశారు. నాందేడ్‌ సమావేశం తర్వాత బీఆర్‌ఎస్‌కు మరాఠ్వాడా గడ్డపై ఇది రెండో సభ. ‘శివాజీ మహరాజ్‌ జన్మించిన పావన ధాత్రికి, మరాఠా భూమికి నమస్కరిస్తున్నాను’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌..  దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని, దాన్నెవరూ ఆపలేరని అన్నారు. తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరెంట్‌ అందిస్తున్నామని, రైతు బీమా ఇస్తూ.. పూర్తిగా పంటను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడణవీస్‌ చేస్తే మళ్లీ మహారాష్ట్ర రానని ప్రకటించారు. అలాంటి పథకాలు అమలు చేయనంత వరకు వస్తూనే ఉంటానని చెప్పారు.
కెసిఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు …
తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్‌ చేస్తే నేను మహారాష్ట్ర రానని ప్రకటిస్తున్నా. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటా. మహారాష్ట్రలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో దళితబంధు ఇస్తున్నాం. మహారాష్ట్రలోనూ దళితబంధు అమలు చేస్తే రానని ప్రకటిస్తున్నా. అంబేద్కర్‌ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా. మహారాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కరించండి నేను మహారాష్ట్ర రాను. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా పేదల బతుకులు మారలేదు. కాంగ్రెస్‌, బీజేపీలతో మన బతుకులు మారాయా?. రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు ? నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరో ఆలోచించండి.
మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి నీరందిస్తాం.
అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. కాంగ్రెస్‌ 54 సంవత్సరాలు, బీజేపీ 14 ఏళ్లు పాలించి ఏం చేశాయి? ఏటా 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నిధులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరుగట్లేదు? మహారాష్ట్రలో సాగు, తాగునీరు చాలాచోట్ల అందుబాటులో లేదు. మన కండ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతుంది. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతాం. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయి. దేశంలో 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటలు సులభంగా విద్యుత్‌ సులభంగా ఇవ్వొచ్చు. 125 ఏళ్ల పాటు విద్యుత్‌ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉంది. అయినా ఎందుకు విద్యుత్‌ ఇవ్వలేకపోతున్నారు. పీఎం కిసాన్‌ కింద కేంద్రం కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తుంది. పీఎం కిసాన్‌ కింద రైతులకు కనీసం రూ.10వేలు ఇవ్వాలి. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదు. బతుకులపై ఆలోచన సభ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular