Thursday, May 30, 2024
HomeసినిమాSSMB28: సంక్రాంతి బరిలో మహేష్ బాబు

SSMB28: సంక్రాంతి బరిలో మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో మహేష్‌ కు జంటగా క్రేజీ హీరోయిన్స్ పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా మహేష్ బాబు కుటుంబంలో వరుష విషాదాలు చోటు చేసుకోవడంతో ఆలస్యమయ్యింది.  ఈ సినిమా టైటిల్ ను శ్రీరామనవమికి విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని నిర్మాణ సంస్థ వెల్లడించింది. సంక్రాంతి కానుకగా 2024 జనవరి13న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో మహేష్ మాస్ లుక్ లో… సిగరెట్ తాగుతూ కనిపించారు. పోరాట సన్నివేశంలోని ఈ పోస్టర్ అలరిస్తోంది.

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన  అతడు, ఖలేజా చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చాయి. అయితే.. వెండి తెర పై కన్నా బుల్లితెర పైనే ఈ రెండూ బాగా విజయం సాధించాయి. ఈ తాజా సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్