Sunday, June 14, 2026
Homeసినిమాతరుణ్ భాస్కర్ 'కీడా కోలా' రెండో షెడ్యూలు ప్రారంభం

తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ రెండో షెడ్యూలు ప్రారంభం

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూలు పూర్తయింది.

ఈ రోజు నుండి రెండో షెడ్యూలుని ప్రారంభించింది చిత్ర యూనిట్. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 లో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు. ఇప్పటి వరకు తరుణ్‌ భాస్కర్ తెరకెక్కించిన రెండు సినిమాలు పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది తెలుగులోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. మరి.. ఈ పాన్ ఇండియా మూవీతో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular