Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీకి వచ్చేసిన 'రఘు తాత'

ఓటీటీకి వచ్చేసిన ‘రఘు తాత’

తెలుగు .. తమిళ భాషల్లో  కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ రెండు భాషల్లోను ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనపరంగా .. గ్లామర్ పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుతూ ఆమె దూసుకుపోతోంది. ఇక నాయిక ప్రధానమైన పాత్రలను చేయడంలోను ఆమె ముందే ఉంది. అలాంటి కీర్తి సురేశ్ నుంచి ఇటీవల వచ్చిన సినిమానే ‘రఘు తాత’. టైటిల్ ఇలా ఉన్నప్పటికీ, కథ అంతా కూడా కీర్తి సురేశ్ చుట్టూనే తిరుగుతుంది.

ఈ మధ్య కాలంలో కీర్తి సురేశ్ తెలుగు తెరపై కనిపించలేదు. ఆ మాట కొస్తే తెలుగులో ఆమె హిట్ కొట్టిన చివరి సినిమాగా ‘దసరా’ కనిపిస్తుంది. అందువలన కీర్తి సురేశ్ కి ఇక్కడి అభిమానులతో గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో తమిళంలో ఆమె చేసిన ‘రఘు తాత’ ఓటీటీకి రావడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. తమిళంలో ఆమె చేసిన ‘రఘుతాత’ ను హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు.

ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లకు వచ్చింది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి ‘జీ 5’లో అందుబాటులోకి వచ్చింది. నిజానికి తమిళంతో పాటు తెలుగు .. కన్నడ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు .. కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాను నేరుగా ఓటీటీకి తీసుకుని వచ్చారు.  రవీంద్ర విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. థియేటర్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్