Saturday, March 7, 2026
Homeజాతీయంకొలువు దీరిన కేరళ అసెంబ్లీ

కొలువు దీరిన కేరళ అసెంబ్లీ

కేరళలో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. 15వ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మొత్తం 140మంది సభ్యులుండగా నేడు 137మంది ప్రమాణ స్వీకారం చేశారు. సిపిఐ, సీపీఎం, కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా రావటంతో వారు ప్రమాణం చేయలేకపోయారు.  ప్రొటెం స్పీకర్ గా కున్నమంగళం ఎమ్మెల్యే రహీమ్ వ్యవహరించారు.

మంగళవారం కొత్త స్పీకరును ఎన్నుకుంటారు. ఇప్పటికే స్పీకర్ పదవికి ఎంబి రాజేష్ (సిపిఎం), డిప్యూటి స్పీకర్ గా చిట్టాయం గోపకుమార్ (సిపిఐ) పేర్లను ఎల్దిఎఫ్ నేతను ఖరారు చేశారు, రేపు వారి ఎన్నిక లాంచానమే కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular