Keshav Objected :
మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో గతంలో చేసిన చట్టాలు తప్పని ముఖ్యమంత్రి జగన్ అంగీకరించినట్లేనని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటి ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అయితే మళ్లీ మెరుగైన బిల్లు అంటూ సిఎం సభలో చేసిన ప్రకటన వల్ల ఈ విషయంలో మరింత అనిశ్చితి నెలకొందని చెప్పారు. హైకోర్టులో వాదనలు కొలిక్కి వస్తున్నాయని, తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందని, అన్నీ లెక్కలు వేసుకొని ఈ సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేశవ్ అభిప్రాయపడ్డారు.
మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో మరింత గందరగోళం నెలకొని ఉందన్నారు. మూడు రాజధానుల అనాలోచిత నిర్ణయానికి ఎవరు బాధ్యత వహిస్తారని, ఇప్పటివరకు జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెపుతారని కేశవ్ ప్రశ్నించారు.
Also Read : కేబినేట్ భేటి: ‘మూడు’పై సంచలన నిర్ణయం?