Thursday, June 11, 2026
Homeసినిమాప‌వ‌ర్ స్టార్ మూవీలో కేతికశ‌ర్మ‌?

ప‌వ‌ర్ స్టార్ మూవీలో కేతికశ‌ర్మ‌?

Ketika Power: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ‌కీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఊహించ‌ని విధంగా నివేథా థామ‌స్, అంజ‌లి, అన‌న్య‌ల‌కు ఛాన్స్ ఇచ్చారు. ఆత‌ర్వాత ప‌వ‌న్ న‌టించిన సినిమా భీమ్లా నాయ‌క్. మలయాళ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు సాగర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ చిత్రంలో పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటించింది.

వ‌కీల్ సాబ్, భీమ్లా నాయ‌క్ చిత్రాల త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ చేస్తోన్న మూవీ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రంలోనూ ఎవరూ ఊహించని హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఛాన్స్ ఇచ్చారు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పవన్ కు జోడీగా నటిస్తోంది. ఇదిలా వుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తాజాగా మరో యంగ్ హీరోయిన్ కేతిక శ‌ర్మ‌కు తన సినిమాలో నటించే ఆఫర్ ఇచ్చారని తెలిసింది. అయితే తన పక్కన మాత్రం కాదని సాయి ధరమ్ తేజ్ కు జోడీగా అని  చెబుతున్నారు.

ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటి మూవీతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కేతిక శ‌ర్మ‌. ఈ మూవీలో కుర్రకారుని ఆకట్టుకునేలా అందాలను ఆర‌బోసినా.. కేతికకు భారీ ఆఫర్లు దక్కలేదు. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న‌ ‘అంగరంగ వైభవంగ’లో నటించింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పుడు పవర్ స్టార్ మూవీలో అవకాశం దక్క‌డం అంటే.. కేతిక‌కు బంప‌ర్ ఆఫ‌రే.

Also Read :  మామా అల్లుళ్ళ సినిమా మొదలయ్యేది ఎప్పుడు? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular