Tuesday, March 10, 2026
Homeసినిమాహిట్ కోసమే కేతిక శర్మ వెయిటింగ్!

హిట్ కోసమే కేతిక శర్మ వెయిటింగ్!

Need it: తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో కృతి శెట్టి .. శ్రీలీల తరువాత స్థానంలో కేతిక శర్మ ఒకరుగా కనిపిస్తుంది. కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టేసి దూసుకుపోతోంది. శ్రీలీల మంచి మంచి ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటోంది. ఇక కేతిక శర్మ విషయానికి వస్తే మాత్రం ఆ స్థాయిలో ఊపు కనిపించడం లేదు. ‘రొమాంటిక్’ సినిమాతో ఈ అమ్మాయి తెలుగు తెరపైకి వచ్చింది. ఎలాంటి మొహమాటాలు లేకుండా అందాలు ఆరబోసిన ఈ అమ్మాయిని చూసి కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు.

తెరపై కేతిక చేసిన అందాల సందడి చూసిన కుర్రకారంతా, ఈ మధ్య కాలంలో దబ్బపండులాంటి ఇలాంటి పిల్లను చూడలేదనుకున్నారు. ఆలస్యం చేయకుండా ఆమె అభిమానులుగా మారిపోవడమే తమ ముందున్న ఏకైక మార్గంగా భావించి .. అలాగే చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా తనకి పడవలసిన మార్కులు పడిపోయాయి. ఆ వెంటనే ఆమె నాగశౌర్య జోడీగా ‘లక్ష్య’ సినిమా చేసింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకి దక్కిన ప్రాధాన్యత తక్కువ. అందువలన ఆమె చేయడానికేమీ లేకపోయింది.

 ఇక ఇప్పుడు తన మూడో సినిమాగా ‘రంగరంగ వైభవంగా’ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరిశాయ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వైష్ణవ్ తేజ్ జోడీగా ఆమె ఈ సినిమాలో అలరించనుంది. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో దింపడానికి సన్నాహాలు  చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కావడం .. తనకి మరిన్ని ఛాన్సులు రావడం ఖాయమనే నమ్మకంతో కేతిక ఉంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular