Monday, September 23, 2024
Homeసినిమాతేజ్ చాలా మంచి మనసున్న వ్యక్తి: కథానాయిక కేతిక శర్మ

తేజ్ చాలా మంచి మనసున్న వ్యక్తి: కథానాయిక కేతిక శర్మ

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తునారు.జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

కథానాయిక కేతిక శర్మ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సముద్రఖని గారికి కృతఙ్ఞతలు. పీపుల్ మీడియా బ్యానర్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. తేజ్ చాలా మంచి మనసున్న వ్యక్తి.” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్